భారీ వర్షాల నేపధ్యంలో ఏపీలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

దక్షిణ ఒడిశా భూభాగంపై కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో ఆకస్మిక వరద ముప్పు పొంచివుండటంతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. నాగావళి నదిలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో విజయనగరం జిల్లాలో యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.