గోగినేనిపాలెం జడ్పీ పాఠశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు: కృష్ణా జిల్లాలో ఘనంగా ఏర్పాట్లు
రిపోర్టర్: హరి
స్థలం: Krishna
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం గోగినేనిపాలెంలోని శ్రీ ఎన్జీరంగా జడ్పీ పాఠశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు ముస్తాబైంది. పాఠశాల ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల పదిహేడు, పద్దెనిమిది తేదీల్లో వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దాతల సహకారం, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో ఈ బడి అభివృద్ధి చెందిందని, ఇక్కడ చదివిన ఎందరో ప్రముఖులు ఉన్నత స్థానాలకు ఎదిగి దేశ విదేశాల్లో రాణిస్తున్నారని వారు పేర్కొన్నారు.