పాలకొండలో ఘనంగా వాల్మీకి జయంతి యువత రామాయణ ఆదర్శాలను ఆచరించాలని పిలుపు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు దాసరి నాగభూషణం మాట్లాడుతూ రామాయణం ఆదర్శవంతమైన కావ్యమని పేర్కొన్నారు. ముఖ్య వక్త శంకర్రావు రామాయణంలోని విలువలను వివరిస్తూ, నేటి యువత రామాయణాన్ని చదివి అందులోని ఆదర్శాలను ఆచరించాలని సూచించారు.