టైసన్ నాయుడు చిత్రం: మదరాసి రబ్బరు బొమ్మ సాంగ్ విడుదల చేసిన మేకర్స్
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న టైసన్ నాయుడు చిత్ర యూనిట్ మొదటి పాటను విడుదల చేసినట్లు మేకర్స్ తెలిపారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన మదరాసి రబ్బరు బొమ్మ అంటూ సాగే ఈ ఫోక్ నంబర్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సురేష్ గంగుల లిరిక్స్ అందించగా నల్గొండ గద్దర్ నర్సన్న, రోహిణి సొరట్ పాడారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను చిత్ర బృందం గ్రాండ్ గా నిర్వహిస్తోంది.