బైక్ వివాదంతో గిరిజన యువకుడు రాజేష్ ఆత్మహత్య మరియు కాంగ్రెస్ నేతల వేధింపులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మనవడు, కాంగ్రెస్ నాయకుడు పోచబోయిన సురేష్ యాదవ్ వేధింపులే కారణమని ఎరుకల సామాజిక వర్గానికి చెందిన గిరిజన యువకుడు రాజేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బైక్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా సురేష్ యాదవ్ తనపై దాడి చేసి వేధించడంతో మనస్తాపం చెంది రాజేష్ అర్ధరాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు, కేసును తప్పుదారి పట్టించేందుకు ఈశ్వరమ్మ యాదవ్ మృతుడి తల్లికి డబ్బుల ఆశ చూపి సెటిల్‌మెంట్‌కు ప్రయత్నించారని, తమకు న్యాయం చేయాలని గిరిజన, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.