ఎన్నికల బందోబస్తు పరిశీలన: విశాఖలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన సీపీ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విశాఖపట్నం

ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం విశాఖపట్నంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. ఎన్నికలు జరుగబోవు పోలింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూములను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా తొమ్మిది వందల యాభై మూడు మందికి పైగా పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం నియమించినట్లు స్పష్టం చేస్తూ, కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.