అల్లినగరంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎచ్చెర్ల

ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో శ్రీ వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ శక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మండపాన్ని రంగురంగుల పూలు, ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. తొమ్మిది రోజుల పాటు వివిధ రకాల పూజా కార్యక్రమాలు, భజనలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.