హైదరాబాద్‌లో కొత్త మల్టీప్లెక్స్ ఏర్పాటుకు విజయ్ దేవరకొండ ప్లాన్!

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వ్యాపార రంగంలో దూకుడు పెంచారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో ఏవిడీ సినిమాస్ నిర్వహిస్తున్న ఆయన, నార్త్ హైదరాబాద్‌లోని మేడ్చల్ లేదా మల్కాజ్‌గిరి ప్రాంతంలో మరో కొత్త మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక దశలో ఉంది. మరోవైపు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'రణబాలి' సినిమా అక్టోబర్ 16, 2026న విడుదల కానుంది.