గణేష్ నిమజ్జన ఘాట్లను పరిశీలించిన అదనపు ఎస్పీ మహంతి కిషోర్

రిపోర్టర్: రాము స్థలం: కాకినాడ

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ గణేష్ నిమజ్జన ఘాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రత, బారికేడింగ్, లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. వివిధ శాఖల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.