మణికొండలో చెడ్డీ గ్యాంగ్ కలకలం అపార్ట్మెంట్లో చోరీకి యత్నం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ మణికొండలోని నెక్నాంపూర్ ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించిందని పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఫ్లోటిల్లా అపార్ట్మెంట్లోకి చొరబడిన ఆరుగురు దుండగులు విలువైన వస్తువులను అపహరించినట్లు వెల్లడించారు. అడ్డుకున్న మహిళపై ఆయుధాలతో దాడికి యత్నించి పరారయ్యారని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారని, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారని అధికారులు స్పష్టం చేశారు.