లక్నోలో దారుణం: భార్యను హత్య చేసిన పోలీసు కానిస్టేబుల్ అరెస్ట్

రిపోర్టర్: సతీష్ స్థలం: ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ లక్నోలో ఘోరం జరిగింది. ఇనుప రాడ్డుతో తలపై బాది భార్య రష్మి శ్రీవాత్సవను హెడ్ కానిస్టేబుల్ హిమాన్షు శ్రీవాత్సవ కిరాతకంగా హత్య చేశాడు. మహానగర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో ఈ ఘటన వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు అసలు కారణం ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.