కునో నేషనల్ పార్క్ లో చిరుతపులి మృతి: ఇద్దరు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Sheopur
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో చిరుతపులి మృతి కేసులో భగవాన్ సింగ్, ప్రీతమ్ సింగ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. వేట సమయంలో చిరుతను చిరుతపులిగా పొరబడి పురాతన తుపాకీతో కాల్చి చంపినట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ చీతా ప్రారంభమైన తర్వాత చిరుత మృతి చెందడం ఇదే మొదటిసారి కావడంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.