ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో బిజెపి నాయకులు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి పేదవాడికి, మహిళలకు, యువతకు సంక్షేమ పథకాలు అందిస్తున్న మహానాయకుడని కొనియాడారు. పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.