స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు జగన్ కుట్రలు: మంత్రి అనగాని ధ్వజం
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
బీసీలకు రాజ్యాధికారం దక్కడం వైసీపీ అధినేత జగన్ కు ఇష్టం లేదని, అందుకే స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి ఆయన కుట్రలు పన్నుతున్నారని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్ లో బీసీలకు కూటమి ప్రభుత్వం యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించిందని ఆయన తెలిపారు. వెనుకబడిన తరగతులకు కేవలం హామీలివ్వడం కాకుండా, వాటిని ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.