ప్రజాసేవే లక్ష్యంగా గంగాధరనెల్లూరులో భారీ మెజారిటీ కోరిన టీడీపీ అభ్యర్థి హరీష్

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

గంగాధరనెల్లూరు మండలం కొటాగారం కలిజవేడు సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరీష్ శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. మండల అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సేవలు అందిస్తానని భరోసా కల్పించారు. ప్రతి గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతానని పేర్కొంటూ ఓటర్లు తమను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.