అమరరాజ తరలింపు ఘోర తప్పిదం: వెంకయ్యనాయుడు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: గుంటూరు
అమరరాజ పరిశ్రమ ఇక్కడి నుంచి తరలిపోయే పరిస్థితి కల్పించడం రాజకీయ ద్వేషాలతో జరిగిన ఘోర తప్పిదమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో డాక్టర్ గల్లా రామచంద్రనాయుడికి యలపర్తి నాయుడమ్మ పురస్కారం ప్రదానం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విదేశాల్లో అవకాశాలున్నా మన ప్రాంతంలో పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పిస్తున్న వారిని ప్రోత్సహించాలని, రాజకీయాలకతీతంగా అభివృద్ధి జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.