అధికారులు లేని గ్రామసభలో నిరసన: జీకే వీధిలో దారకొండ రైతుల ఆగ్రహం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం కార్యదర్శి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక అధికారి, ఇతర శాఖల సిబ్బంది గైర్హాజరు కావడంతో రైతులు, స్థానిక నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తుపానుతో దెబ్బతిన్న పంటల నష్టపరిహారంపై అధికారులెవరిని సంప్రదించాలో తెలియక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.