తుపాను వర్షాలకు దెబ్బతిన్న కోదువలస రహదారి మరమ్మతులకు విజ్ఞప్తి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పెదబయలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం లక్ష్మీపేట పంచాయతీ పరిధిలోని కోదువలస గ్రామానికి వెళ్లే రహదారి తుపాను ప్రభావంతో పూర్తిగా దెబ్బతిన్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారి బురదమయంగా మారి రాకపోకలు కష్టతరంగా మారాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర వైద్యం కోసం వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి మరమ్మతులకు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.