'రష్యా చమురు కొంటే వంద శాతం సుంకాలు': అమెరికా సెనెట్ సంచలన నిర్ణయం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానంలో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై వంద శాతం సుంకాలు విధించే ప్రతిపాదనకు అమెరికా సెనెట్ ఆమోద ముద్ర వేసింది. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు సెనెట్‌లో పాస్ కావడంతో, చైనా, భారత్ వంటి దేశాలపై గరిష్టంగా నూటికి నూరు శాతం పెనాల్టీ టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి లభించింది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేలా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.