రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యమంటూ మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ

రిపోర్టర్: శివ స్థలం: కొచ్చి

ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడం, యువతకు ఉద్యోగాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, క్రికెట్ మ్యాచ్ల నిమిత్తం వెళ్లినప్పుడు కూడా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర అభివృద్ధిపై చర్చిస్తుంటానని తెలిపారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి ఆశలు లేవని, తనకు అప్పగించిన బాధ్యతలను మాత్రమే సమర్థంగా నిర్వర్తించడమే ధ్యేయమని నారా లోకేష్ వెల్లడించారు.