పాము కాటుతో మృతి చెందిన రైతు కుటుంబానికి శంకర్రెడ్డి ఆర్థిక సాయం

రిపోర్టర్: మదన్ రాయల్ స్థలం: తిరుపతి అర్బన్

కాట్రపల్లి గ్రామానికి చెందిన దళిత రైతు పాము కాటుతో మృతి చెందడంతో సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కురపాటి శంకర్రెడ్డి తక్షణమే స్పందించి బాధితులను పరామర్శించారు. మృతుడి కుటుంబ పరిస్థితిని స్వయంగా తెలుసుకుని తన వంతు సహాయంగా పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం పట్ల గ్రామస్థులు నాయకుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.