'అల్పపీడనం ప్రభావంతో వర్షాలు': విశాఖలో వాతావరణ శాఖ హెచ్చరిక

రిపోర్టర్: మహేష్ స్థలం: విశాఖపట్నం

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో, ఈనెల 19న అల్పపీడనం ఏర్పడి పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు కురిశాయని, రాగల రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేశారు.