దుబ్బాకలో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: సిద్దిపేట
దుబ్బాక పట్టణంలో తానా ఫౌండేషన్ మరియు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించి, ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.