ప్రాణాలకు తెగించి ఓటు హక్ కు వినియోగించుకుంటున్న కోనసీమ మరియు మన్యం ఓటర్లు
రిపోర్టర్: సురేష్
స్థలం: కోనసీమ
రాష్ట్రంలో పరిషత్ పోలింగ్ సందర్భంగా కోనసీమ మరియు మన్యం ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మరియు పార్వతీపురం మన్యం జిల్లాల్ లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు నదులు, వాగులు దాటాల్సి వస్తోందని తెలిపారు. ప్రతీ ఎన్నికల సమయంలోనూ రవాణా సౌకర్యం లేక ప్రాణాలకు తెగించి ఓటు వేయాల్సి వస్తోందని వాపోయారు.