నా జీవిత చరిత్రపై సినిమా తీయడంపై సిల్వెస్టర్ స్టాలిన్ ఆశ్చర్యం
రిపోర్టర్: సతీష్
స్థలం: హాలీవుడ్
తన జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న రాకీ సినిమాపై హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను ఇంకా బతికే ఉన్నానని, ఇప్పుడే బయోపిక్ తీయడం తొందరపాటు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తన కొత్త పుస్తకం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే చిత్రంలో తన యువత పాత్రలో నటించిన ఆంటోనీ ఇప్పోలిటో నటనను చూసి తాను ముచ్చటపడ్డానని, అచ్చం తనలాగే ఉన్నాడని ఆయన పేర్కొన్నారు.