హాలీవుడ్ సంచలనం: అధికారికంగా విడాకులు తీసుకున్న స్పైడర్ మన్ నటుడు
రిపోర్టర్: విజయ్
స్థలం: Los Angeles
హాలీవుడ్ ప్రముఖ నటుడు టోబీ మెగ్వైర్ మరియు ఆయన భార్య జెన్నిఫర్ మేయర్ అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు కోర్టు పత్రాల ద్వారా వెల్లడైంది అని హాలీవుడ్ మీడియా నివేదించింది. సుదీర్ఘ కాలం పాటు వేరుగా ఉంటున్న ఈ జంట వివాహ బంధానికి చట్టబద్ధంగా స్వస్తి పలికారు. ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగుతూ పిల్లల బాధ్యతలను సమిష్టిగా చూసుకుంటున్నట్లు తెలిపారు.