సాలూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ముప్పై ఒక కోట్లు విడుదల
రిపోర్టర్: సతీష్
స్థలం: సాలూరు
సాలూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా రూ.31 కోట్లు విడుదల చేశారు. ఇందులో హెచ్‌ఏఎం కింద రూ.21 కోట్లు, యూసీఎఫ్ కింద రూ.10 కోట్లు కేటాయించారు. కుప్పం నుంచి సీఎం చంద్రబాబు ఈ పనులకు శ్రీకారం చుట్టారు. చంద్రన్న ప్రభుత్వంలో సాలూరు అభివృద్ధికి నిధుల కొరత లేదని, ఇప్పటివరకు మొత్తం రూ.143.7 కోట్ల నిధులు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.