మేడ్చల్ జిల్లాలో రైలు రూపంలో ముంచుకొచ్చిన ఘోర విషాదం
రిపోర్టర్: రమేష్
స్థలం: మేడ్చల్-మల్కాజిగిరి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఔషాపూర్ సమీపంలో రైల్వే పట్టాలపై దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో వందకుపైగా గొర్రెలు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాజీపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. గొర్రెల కాపరి నిద్రిస్తున్న సమయంలో రైలు శబ్దానికి భయపడిన మూగజీవాలు పట్టాలపైకి పరుగులు తీయడంతో ఈ భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం.