ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ చర్చలు విఫలం: ప్రైవేట్ టెండర్లపై తీవ్ర నిరసన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమరావతి

ఏపీఎస్ఆర్టీసీ జేఏసీతో యాజమాన్యం జరిపిన చర్చలు పూర్తిగా విఫలమయ్యాయని జేఏసీ రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు. విద్యుత్ బస్సుల ప్రైవేట్ టెండర్లు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు పిలుపునిచ్చారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పదిహేను వేల పోస్టులను భర్తీ చేయాలని, నాలుగు వేల కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని వారు కోరారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటుపరం చేసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జేఏసీ నాయకులు వెల్లడించారు.