అమెరికా ఎన్నికలు: వివేక్ రామస్వామికి బూమరాంగ్‌గా మారిన వివాదాస్పద ప్రచార వ్యూహం
రిపోర్టర్: హరి
స్థలం: ఓహియో
అమెరికాలోని ఓహియో గవర్నర్ ఎన్నికల్లో భారతీయ సంతతి నేత వివేక్ రామస్వామికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. డెమొక్రటిక్ అభ్యర్థి అమీ ఆక్టన్ తల్లిని ప్రచారంలోకి తెస్తూ రూపొందించిన వివాదాస్పద ప్రకటన ఆయనకే వ్యతిరేకంగా మారింది. సర్వేల్లో వెనుకబడుతున్న తరుణంలో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు రావడం వివేక్‌కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.