ది ప్యారడైజ్ సినిమా రికార్డులు తిరగరాస్తుంది తిరుమలలో మోహన్ బాబు వ్యాఖ్యలు

రిపోర్టర్: సునీల్ స్థలం: తిరుమల

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ చిత్రం తెలుగు చలనచిత్ర రికార్డులను తిరగరాస్తుందని కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో సోమవారం ఉదయం తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను శికంజ మాలిక్ అనే శక్తివంతమైన ప్రతినాయక పాత్ర పోషించానని, సినిమా అద్భుతంగా వచ్చిందని తెలిపారు.