'అసెంబ్లీ సాక్షిగా సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారు': రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఫైర్

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడి సీఎం స్థాయిని దిగజార్చారని మాజీ మంత్రి విమర్శించారు. కేసీఆర్‌కు ఉన్నది కేవలం 67 ఎకరాలని చెప్తే, 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉందంటూ తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు విడ్డూరమని ఆయన నిలదీశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ అబద్ధపు ప్రచారాలను ప్రజలంతా గమనిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.