మున్సిపల్ ఎన్నికలు: పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఈ నెల 28న సెలవు
రిపోర్టర్: సునీల్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్న ప్రాంతాల్లో అధికార యంత్రాంగం, ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటమే లక్ష్యంగా సెలవులను ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఈ నెల 28న అధికారికంగా సెలవు వర్తిస్తుందని, ఉద్యోగులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు.