రాప్తాడు ఉన్మాది హేమంత్ పై పోలీసుల కాల్పులు: ఎన్కౌంటర్ పై సర్వత్రా హర్షం
రిపోర్టర్: విజయ్
స్థలం: శ్రీ సత్యసాయి జిల్లా
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థిని గోపికపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మకూరు అడవిలో గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో పోలీసులపైకి ఎదురుదాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్ లో హేమంత్ తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటూ పోలీసుల చర్యను స్వాగతించారు.