మహిళల రక్షణ అందరి బాధ్యత: డీజీ చారు సిన్హా స్పష్టీకరణ

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

మహిళల భద్రత అనేది కేవలం పోలీసు కేసులు, చట్టాల అమలుతోనే ముడిపడి లేదని, సమాజం ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే నిజమైన రక్షణ లభిస్తుందని మహిళా భద్రతా విభాగం డీజీ చారు సిన్హా స్పష్టం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గురువారం ప్రారంభమైన స్టాండ్ విత్ హర్ శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, వేధింపులను మూగ ప్రేక్షకులుగా చూడకుండా అన్యాయాన్ని నేరుగా నిలదీసి మహిళలకు అండగా నిలవాలని యువతకు పిలుపునిచ్చారు.