నాగావళి నదికి వరద పోటుతో వణుకుతున్న తీర ప్రాంత వాసులు
రిపోర్టర్: విజయ్
స్థలం: పార్వతీపురం మన్యం
తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పార్వతీపురం మన్యం జిల్లాలోని నాగావళి నదికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. తోటపల్లి, మడ్డువలస రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో పాటు ఒడిశాలోనూ వర్షాలు కురుస్తుండటంతో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు పొంచివుంది. దీంతో అధికార యంత్రాగం అప్రమత్తమై సబ్‌కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ నేతృత్వంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి తీర ప్రాంత ప్రజలను హెచ్చరిస్తున్నారు.