దక్షిణాఫ్రికాలో మహిళల వరుస మరణాలతో స్థానికంగా తీవ్ర భయాందోళన

రిపోర్టర్: కృష్ణ స్థలం: జొహెన్నెస్‌బర్గ్‌

దక్షిణాఫ్రికాలోని జొహెన్నెస్బర్గ్లో మహిళల మిస్టరీ మరణాలు కలకలం రేపుతున్నాయని పోలీసులు వెల్లడించారు. రెండు నెలల వ్యవధిలో తొమ్మిది మృతదేహాలు లభ్యం కాగా తాజాగా నగర శివారులో మరో మహిళ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ప్రధాన రహదారుల సమీపంలోని బహిరంగ ప్రదేశాల్లో మృతదేహాలను గుర్తించామని, వీటి వెనుక సీరియల్ కిల్లర్ ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. మృతులు ఇరవై, ముప్పై ఏళ్ల వయసువారేనని, చాలామంది గాయాలతో ఉన్నారని తెలిపారు.