శ్రీ సత్యసాయి జిల్లాలో విస్తృతంగా పోలీసుల భద్రతా అవగాహన సదస్సులు
రిపోర్టర్: గోపి
స్థలం: శ్రీ సత్యసాయి
శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు భద్రత, మహిళలు మరియు చిన్నారుల రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు Satya Sai Police వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు లేపాక్షి, పుట్టపర్తి రూరల్ పరిధిలో పోలీసులు ఈ సదస్సులు చేపట్టారు. వాకర్స్‌కు రోడ్డు నిబంధనలపై సీఐ జనార్ధన్ అవగాహన కల్పించగా, గ్రామాల్లో మహిళల భద్రత, నేరాల నియంత్రణపై సీఐ బొజ్జప్ప పలు కీలక సూచనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు.