న్యూజెర్సీలో ఘనంగా ధర్మ ఫర్ మోడర్న్ మైండ్స్ కార్యక్రమం
రిపోర్టర్: వెంకట్
స్థలం: న్యూజెర్సీ, అమెరికా
న్యూజెర్సీలోని ఎడిసన్ శ్రీ శివ విష్ణు టెంపుల్లో 'ధర్మ ఫర్ మోడర్న్ మైండ్స్' కార్యక్రమం ఘనంగా జరిగింది. నేషనలిస్ట్ హబ్ వ్యవస్థాపకుడు సాయి కృష్ణ అవునూరి ముఖ్య వక్తగా హాజరై ఆధునిక జీవనంలో ధర్మ ప్రాముఖ్యతపై ప్రసంగించారు. సోషల్ మీడియా, ఏఐ యుగంలో యువత ధార్మిక విలువలను ఎలా ఆచరించాలో వివరించారు. కమ్యూనిటీ సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.