నకిరేకల్ పెట్రోల్ బంకులో మౌలిక వసతులు కరువు డెన్సిటీపై అనుమానాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: Nalgonda
నకిరేకల్ పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో వాహనదారులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం జరుగుతోందని, వాష్‌రూమ్, తాగునీరు, గాలి పెట్టుకునే వసతులు లేవని వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంధన నాణ్యత, డెన్సిటీ పరీక్షల నిర్వహణపైనా అనుమానాలు వ్యక్తమవుతుండగా, సంబంధిత అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వాస్తవాలను బయటపెట్టాలని వారు కోరుతున్నారు.