మురసు తుఫాను ముప్పు: లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Andhra Pradesh
మురసు తుఫాను ప్రభావంతో వాగులు, వంకలకు వరద ప్రవాహం భారీగా పెరిగిందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లు CMO Andhra Pradesh వెల్లడించారు. పొంగిపొర్లుతున్న వాగుల కారణంగా రహదారులపై రాకపోకలు సాగించే సమయంలో ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం జరగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన స్పష్టంగా హెచ్చరించారు.