ఇంటివద్దే పింఛన్ అందించాలని ఆంధ్రయ్య ప్రభుత్వాన్ని కోరారు

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

పింఛన్ సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేసి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టే విధానాన్ని విరమించాలని ఏపీ వికలాంగులు, పింఛన్దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.ఎన్. ఆంధ్రయ్య డిమాండ్ చేశారు. చిట్వేల్లో ఆయన మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు బ్యాంకుల చుట్టూ తిరగలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే పూర్తి మొత్తాన్ని ఇంటివద్దే అందించాలని కోరారు. అర్హులందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.