విజయనగరం జిల్లాలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయనగరం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించామని, అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.