తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కాళోజీ.. బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఘన నివాళి!

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ యావత్ జీవిత కాలాన్ని తెలంగాణ సమాజం కోసం అంకితం చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు.