ఎల్పీజీ సిలిండర్ల సబ్సిడీకి బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి
రిపోర్టర్: రమేష్
స్థలం: New Delhi
సబ్సిడీ ధరకే ఎల్పీజీ సిలిండర్లు పొందాలంటే అక్టోబర్ 1 నాటికి బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ పూర్తి చేయాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అనర్హతలను తొలగించి, సబ్సిడీ వంటగ్యాస్ అర్హులైన గృహాలకే చేరేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ధృవీకరణ పూర్తి చేసిన వినియోగదారులు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని, పూర్తి కాని వారు డెలివరీ సమయంలో లేదా మొబైల్ యాప్ల ద్వారా దీన్ని పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.