భక్తిశ్రద్ధలతో పులకించిన శ్రీరామచంద్రస్వామి సప్తగిరి శిఖరాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: గుర్రంపోడు
గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మన తెలంగాణ రిపోర్టర్ బైరెడ్డి రమేష్, రాజేశ్వరి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.