విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుపై ఎస్టీ టెలీమీడియా వైస్ ప్రెసిడెంట్తో మంత్రి లోకేష్ భేటీ

రిపోర్టర్: మహేష్ స్థలం: విశాఖపట్నం

డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఎస్టీ టెలీమీడియా వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ జెనాను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్లో ఆహ్వానించారు. గుజరాత్లో జరిగిన ఈ సమావేశంలో విశాఖను డేటా సెంటర్ హబ్గా మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే గూగుల్, రిలయన్స్ సంస్థలు వస్తున్నాయని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని గౌతమ్ జెనా తెలిపారు.