రైతన్నల కోసం కూటమి సర్కార్ సంకల్పం: పొన్నూరులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: గుంటూరు

రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక సంకల్పంతో ముందుకు వెళ్తోందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెల్లడించారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గంలో అన్నదాతలకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రైతు అనుకూల విధానాలతో వ్యవసాయ రంగంలో నూతన మార్పులు వస్తున్నాయని, క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి రైతుకు పట్టాదారు పాసుపుస్తకాలను పారదర్శకంగా అందిస్తున్నామని ఆయన పేర్కొంటూ ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.