ధర్నా చౌక్ బందోబస్తులో నున్న ఇన్స్పెక్టర్ అహ్మద్ అలీ మృతి
రిపోర్టర్: హరి
స్థలం: ఎన్టీఆర్
ధర్నా చౌక్ వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తూ నున్న పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.కే. అహ్మద్ అలీ ఆకస్మికంగా మృతి చెందడం అత్యంత విషాదకరమని విజయవాడ సిటి పోలీస్ వెల్లడించారు. మూడు దశాబ్దాల పాటు నిబద్ధతతో పోలీస్ శాఖకు సేవలందించిన ఆయన మృతి పట్ల నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పోలీస్ శాఖ వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు సిటి పోలీస్ పేర్కొన్నారు.