డిసెంబర్ నాటికి ప్రత్యేక పోర్టల్: ఢిల్లీ యూనివర్సిటీ కీలక నిర్ణయం
రిపోర్టర్: నరేష్
స్థలం: New Delhi
విద్యార్థుల వసతి గృహాల భద్రతపై దృష్టి సారించిన ఢిల్లీ యూనివర్సిటీ ఒక ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేస్తోందని సౌత్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రజని అబ్బి వెల్లడించారు. సత్య నికేతన్ భవనం కూలిన ఘటనలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పీజీ వసతి గృహాల వివరాలను సేకరించి, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు ఎంసీడీతో కలిసి ఎస్ఓపీ రూపొందిస్తున్నట్లు వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.